Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...


 *రూ.1.23 కోట్ల విలువైన 618 సెల్‌ఫోన్లు బాధితులకు అప్పగింత

కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ నిఘా, డేటా విశ్లేషణ పద్ధతులను వినియోగించి పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అప్పగించడంలో కాకినాడ జిల్లా పోలీసులు మరోసారి సఫలీకృతులయ్యారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా సేకరించిన రూ.1,23,60,000 విలువైన 618 సెల్‌ఫోన్లను బుధవారం బాధితులకు తిరిగి అప్పగించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 13 విడతల్లో మొత్తం రూ.8,92,27,000 విలువైన 5,221 పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సేకరించి బాధితులకు అప్పగించినట్లు తెలిపారు. ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు


మొబైల్ ఫోన్ దొంగతనానికి గురైనప్పుడు లేదా పోగొట్టుకున్నప్పుడు వెంటనే సిమ్ కార్డును, బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేయించుకోవాలని ఎస్పీ సూచించారు. అలాగే సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసేటప్పుడు అపరిచిత వ్యక్తుల నుంచి కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు.

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి సేకరించడంలో విశేష ప్రతిభ కనబరిచిన జిల్లా ఐటీ కోర్ పోలీసులను ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం. కిషోర్ కుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీహరి రావు, ఐటీ కోర్ సిబ్బంది, వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీస్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ