Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...


 కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :

తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పంతం నానాజీ గురువారం పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో కలిసి వర్షాల కారణంగా ఏర్పడిన సమస్యలు, చేపడుతున్న సహాయక చర్యలను ఆయన సమీక్షించారు.

రమణయ్యపేట గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్ గాంధీ కళాశాల సమీపంలోని డంపింగ్‌ యార్డు, ఇరిగేషన్‌ కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించే పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పలు సమస్యలు పేరుకుపోయాయని, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

తిమ్మాపురం నుంచి ఎస్‌.అచ్చుతాపురం వరకు ఉన్న ఇరిగేషన్‌ కాలువను పూర్తిస్థాయిలో రెగ్యులేట్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు కాలువల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కాలువల ఆక్రమణలపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

గతంలో ఇరిగేషన్‌ కాలువల ఆక్రమణలపై నిర్లక్ష్యం జరిగిందని ఎమ్మెల్యే ఆరోపించారు. బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులు వ్యవస్థలను, నిబంధనలను పక్కన పెట్టడం సరికాదన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని నానాజీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎండీవో సతీష్, ఈవోపీఆర్డీ శ్రీరామ ఆంజనేయులు, కార్యదర్శి చంద్రకళతో పాటు కూటమి నాయకులు మాదారపు తాతాజీ, కర్రీ వెంకటరాజు, అను బాబు, తాటికాయల వీరబాబు, కుడిపూడి బాలాజీ, బత్తుల దొరబాబు, ఇంద్ర, మేక లక్ష్మణ్‌మూర్తి, తురగ సంతోష్, తోటకూర సతీష్, రామిశెట్టి సునీల్, రోహిత్ కుమార్, రాయుడు అనిల్, పాలిక వాసు, పంపన మహేష్, లాయర్ హేమ, గిడుదురి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ