Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...
కాకినాడ జిల్లా : పెద్దాపురం : ఫాస్ట్ రన్నర్ :
పెద్దాపురం నియోజకవర్గంలోని వేట్లపాలెం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. జనసేన పార్టీకి చెందిన 10 కుటుంబాలు దవులూరి దొరబాబు నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి.
వేట్లపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిడదవోలు సురేష్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగా పార్టీలో చేరిన కుటుంబాలకు పార్టీ నాయకులు స్వాగతం పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రజా సమస్యలపై పార్టీ చేస్తున్న పోరాటానికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిడదవోలు సురేష్ చౌదరి, రాంబాబు, వేగుళ్ల వెంకటరమణ, మాకిరెడ్డి రాంబాబు, చిట్టూరి శ్రీను, థామస్ తదితరులు పాల్గొన్నారు.
