Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...
కాకినాడ జిల్లా : కాకినాడ : పాస్ట్ రన్నర్ :
జన్మభూమి పార్కులో వాకర్స్‌ను ఉద్దేశించి పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోజువారీ జీవితంలో శరీర నొప్పులను నిర్లక్ష్యం చేయకుండా, ప్రారంభ దశలోనే తగిన వైద్య సలహా తీసుకోవాల్సిన అవసరాన్ని వైద్యులు వివరించారు.
కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు తదితర సమస్యలకు వ్యాయామం, నడక, సరైన జీవనశైలి ఎంతగానో ఉపయోగపడతాయని సూచించారు. వాకర్స్ పలు సందేహాలను వైద్యులను అడిగి నివృత్తి చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ కామేశ్వరరావు, డాక్టర్ ప్రసన్న కుమార్, డాక్టర్ మహేష్, డాక్టర్ పర్వీన్, డాక్టర్ ఎస్.జి.కె. మూర్తి, డాక్టర్ అనిల్ పొడురి, డాక్టర్ రవికుమార్, డాక్టర్ నఫీసా పాల్గొన్నారు.

