Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...


 కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :

అర్నబ్‌ తుఫాను ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామ పరిధిలోని ఎఫ్‌సీఐ కాలనీ, జనచైతన్య కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్‌తో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.

కాలనీల్లో ముంపు పరిస్థితిని, వరద నీటి ప్రవాహాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద నీటిలో చిక్కుకున్న ప్రజలకు తక్షణమే ఆహారం, తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

ముంపు నీరు త్వరగా దిగిపోయేలా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే నానాజీ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ పర్యటనలో కూటమి నాయకులు తాటికాయల వీరబాబు (బుజ్జి), పలివెల త్రిమూర్తులు, రామిశెట్టి సునీల్, తోటకూర సతీష్, కుడుపూడి బాలాజీ, పంపన మహేష్, ముద్దూర్తి రోహిత్ కుమార్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

🏠
హో మ్ పే జీ