Skip to main content

Posts

📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : ఎంపీటీసీ నామినేషన్లకు భారీ పోలీస్ బందోబస్తు...

Image
 *గురువారం ప్రశాంతంగా ముగిసిన ప్రక్రియ.. కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తయింది. సర్పవరం రూరల్ సీఐ చైతన్య కృష్ణ  సి.ఐ. సి హెచ్ ప్రకాష్ పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎస్సైలు ఏసుబాబు, గణేష్ కుమార్, వీరబాబులతో పాటు పోలీస్ సిబ్బంది ఉదయం నుంచే కార్యాలయ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు, వారి మద్దతుదారులు భారీగా తరలివచ్చిన నేపథ్యంలో ఎలాంటి తోపులాటలు, ఘర్షణలు తలెత్తకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి క్రమబద్ధీకరించారు.ఉదయం ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసేవరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి బందోబస్తు నిర్వహించడంతో ప్రక్రియ సజావుగా సాగింది.ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించి, శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించినందుకు అధికారులకు, ప్రజలకు పోలీస్ యంత్రాంగం ధన్యవాదాలు తెలిపింది.

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Image
15 మంది చిన్నారుల్లో గుండె సంబంధిత సమస్యల గుర్తింపు – ఉచితంగా శస్త్రచికిత్సలు కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ : కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కాకినాడ యూనిట్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా, శ్రీ సత్యసాయి సంజీవని ట్రస్ట్ సహకారంతో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 18 సంవత్సరాల లోపు పిల్లలకు గుండె వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టారు ఈ శిబిరానికి 80 మందికి పైగా చిన్నారులు హాజరుకాగా, వైద్య పరీక్షల్లో ఇద్దరు రెండు నెలల లోపు శిశువులతో పాటు, ఐదు నుంచి 15 సంవత్సరాల వయస్సు గల 13 మంది చిన్నారుల్లో గుండె సంబంధిత సమస్యలను గుర్తించారు. మొత్తం 15 మంది చిన్నారులకు శ్రీ సత్యసాయి సంజీవని ట్రస్ట్ ఆధ్వర్యంలో త్వరలోనే ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె. అనిత, కోరమాండల్ యూనిట్ హెడ్ కె. జగనాథన్, కోరమాండల్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు గౌరీ జగనాథన్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కె. అనిత...

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Image
టీడీపీలోకి 45 మంది నేతలు, కార్యకర్తలు! పుల్ల చందు ఆధ్వర్యంలో పార్టీ మారిన వైసీపీ శ్రేణులు.. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి సమక్షంలో చేరికలు కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ : కాకినాడ రూరల్ నియోజకవర్గం సర్పవరం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, వార్డు సభ్యులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ కాకినాడ రూరల్ యువజన విభాగం అధ్యక్షుడు పుల్ల చంద్రశేఖర్ (చందు) ఆధ్వర్యంలో సుమారు 45 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి దంపతులు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పిల్లి దంపతులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్పవరం గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. గతంలోనే టీడీపీలో చేరాలన్న తమ అభిప్రాయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు తెలియజేశారని, అందులో భాగంగానే తాజాగా వారిని పార్టీలోకి ఆహ్వానించినట్ల...

Kakinada : స్థానిక సమరంలో కూటమి క్లీన్‌స్వీప్ ఖాయం -ఎమ్మెల్యే పంతం నానాజీ

Image
 *ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి  *జనసైనికులు, టీడీపీ శ్రేణులు క్రమశిక్షణతో వ్యవహరించాలి *అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు  *ఎన్నికల పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్, 42 మందితో కమిటీ ఏర్పాటు కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : పాస్టర్ రన్నర్ : రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థుల భారీ మెజారిటీయే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై కూటమి ముఖ్యనేతలు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.క్రమశిక్షణతో కూటమి విజయం సాధించాలి ఎన్నికల ప్రక్రియ పూర్తి ప్రశాంత వాతావరణంలో జరగాలని, ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పార్టీ శ్రేణులు చొరవ చూపాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు అత్యంత క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే స్థానిక ఎన్నికల్లో వారికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సీట్లు కేటాయిస్తున్నామని వెల్...

Kakinada : కాకినాడ జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ఇద్దరు అరెస్ట్...

Image
 15 కేసుల్లో రూ.40 లక్షల విలువైన 280 గ్రాముల బంగారు గొలుసులు, మోటార్ సైకిల్ స్వాధీనం కాకినాడ జిల్లా : కాకినాడ : ఫాస్ట్ రన్నర్ : కాకినాడ జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 15 కేసులకు సంబంధించి రూ.40 లక్షల విలువైన 280 గ్రాముల బంగారు గొలుసులతో పాటు ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నాయి. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, రామచంద్రపురం ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు అరెస్టయిన నిందితులను లంకా దొరబాబు, మందపల్లి వీర్రాజుగా గుర్తించారు. వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించి, నిందితులను అరెస్టు చేయడంతో పాటు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు.

Kakinada : బిసి పక్షపాతి జగన్.. నిండా ముంచుతుంది చంద్రబాబు..

Image
 *బిసిలను దూషించిన చంద్రబాబు..  *సొసైటికి బ్యాక్ బోన్ చేసింది జగన్... *రిజర్వేషన్ పై ద్వంద వైఖరితో చంద్రబాబు.. *బిసి కులాలకు 58 కార్పోరేషన్లు ఏర్పాటు చేసిన జగన్.. కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ : రాష్ట్రంలో బిసిలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు కుటిల రాజకీయానికి తెరతీసారని ఆరోపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల వేళ చంద్రబాబు బిసిల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బిసీలు అయితే ఇప్పుడున్నది చంద్రబాబు టిడిపి అన్నారు. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేసారు, అందుకు కారణం గతంలో చంద్రబాబు బిసిల పట్ల వ్యవహరించ తీరేనని స్పష్టం చేసారు. సాక్షాత్తు రాష్ట్ర సచివాలయంలో బిసిల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు వారిని అవమానించారని గుర్తు చేసారు. వాస్తవానికి రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా ఆర్ధికంగా వెన్నుదన్నుగా నిలిచింది మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని స్పష్టం చేసారు. గత ప్రభుత్వంలో 139 బ...

Kakinada : సన్‌రైజ్ ఆసుపత్రిలో ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం...

Image
 కాకినాడ జిల్లా : కాకినాడ : ఫాస్ట్ రన్నర్ : ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సన్‌రైజ్ ఆసుపత్రిలో సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. డా. అడ్డాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎముకల వైద్య నిపుణులు డా. బొండా సూర్యారావు ప్రజలకు ఎముకల సాంద్రత పరీక్షలు నిర్వహించి, ఆర్థరైటిస్ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డా. అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 12న ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తారని తెలిపారు. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి అండగా నిలవడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి, సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించుకోవచ్చన్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, పోషకాహారం, క్రమబద్ధమైన వ్యాయామంతో మెరుగైన జీవితాన్ని గడపవచ్చని సూచించారు. డా. బొండా సూర్యారావు మాట్లాడుతూ ఆర్థరైటిస్ అనేది కేవలం వృద్ధులకు మాత్రమే వచ్చే వ్యాధి కాదని, పిల్లలు, యువకులు సహా ఏ వయస్సు వారినైనా ప్రభావితం చేయవచ్చని వివరించారు. క...