Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : బిసి పక్షపాతి జగన్.. నిండా ముంచుతుంది చంద్రబాబు..


 *బిసిలను దూషించిన చంద్రబాబు.. 

*సొసైటికి బ్యాక్ బోన్ చేసింది జగన్...

*రిజర్వేషన్ పై ద్వంద వైఖరితో చంద్రబాబు..

*బిసి కులాలకు 58 కార్పోరేషన్లు ఏర్పాటు చేసిన జగన్..

కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :

రాష్ట్రంలో బిసిలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు కుటిల రాజకీయానికి తెరతీసారని ఆరోపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల వేళ చంద్రబాబు బిసిల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బిసీలు అయితే ఇప్పుడున్నది చంద్రబాబు టిడిపి అన్నారు. మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేసారు, అందుకు కారణం గతంలో చంద్రబాబు బిసిల పట్ల వ్యవహరించ తీరేనని స్పష్టం చేసారు. సాక్షాత్తు రాష్ట్ర సచివాలయంలో బిసిల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు వారిని అవమానించారని గుర్తు చేసారు. వాస్తవానికి రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా ఆర్ధికంగా వెన్నుదన్నుగా నిలిచింది మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని స్పష్టం చేసారు. గత ప్రభుత్వంలో 139 బిసి ఉపకులాలకు 58 కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి నాంది పలికారన్నారు. ఒక చేత్తో బిసిలకు 34 శాతం రిజర్వేషన్ అని ప్రకటనలు చేస్తూ మరో వైపు ప్రతాప్ రెడ్డి లాంటి వారితో కోర్టుల్లో కేసులు వేయించడం చంద్రబాబు కుటిల రాజకీయానికి తార్కాణం అన్నారు.య నామినేటెడ్ పదవులు మొదలు, కాంట్రాక్టులు, చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీలకు సముచిత స్థానం కల్పించి సామాజిక న్యాయం చేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని వెల్లడించారు. గత ప్రభుత్వంలో సుమారుగా రూ. 4 లక్షల కోట్లకు పైగా బిసిలకు చేయూతనందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని స్పష్టం చేసారు. బిసి కులాలకు సున్నావడ్డీ, ఆసరా, చేయూత, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా వంటి పథకాలను అందించారని గుర్తు చేసారు. ఇక రాజకీయ పరంగా బిసిలకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రాధాన్యత కల్పించారన్నారు. డిప్యూటి సిఎం పదవి మొదలు వార్డు మెంబర్లకు వరకు బిసిలను బ్యాక్ బోన్ గా భావించి పట్టకట్టారన్నారు. మరి ఏం చేసారని చంద్రబాబు బిసిల పక్షపాతి అనుకోవాలని ప్రశ్నించారు. 2014 – 19 మధ్య బిసిలకు ఒక్క రాజ్యసభ స్థానం అయినా ఇచ్చారా అన్ని ప్రశ్నించారు. బిసిల రిజర్వేషన్ అమలు సాధ్యం కాదని తెలిసినా వారిని మోసం చేసేందుకు మరోసారి కపట ప్రేమను చూపిస్తున్నారని మండిపడ్డారు జమ్మలమడక నాగమణి..

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ