Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : కాకినాడ జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ఇద్దరు అరెస్ట్...


 15 కేసుల్లో రూ.40 లక్షల విలువైన 280 గ్రాముల బంగారు గొలుసులు, మోటార్ సైకిల్ స్వాధీనం

కాకినాడ జిల్లా : కాకినాడ : ఫాస్ట్ రన్నర్ :

కాకినాడ జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 15 కేసులకు సంబంధించి రూ.40 లక్షల విలువైన 280 గ్రాముల బంగారు గొలుసులతో పాటు ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నాయి. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం, రామచంద్రపురం ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు


అరెస్టయిన నిందితులను లంకా దొరబాబు, మందపల్లి వీర్రాజుగా గుర్తించారు. వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించి, నిందితులను అరెస్టు చేయడంతో పాటు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ