Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : స్థానిక సమరంలో కూటమి క్లీన్‌స్వీప్ ఖాయం -ఎమ్మెల్యే పంతం నానాజీ


 *ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి 

*జనసైనికులు, టీడీపీ శ్రేణులు క్రమశిక్షణతో వ్యవహరించాలి

*అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు 

*ఎన్నికల పర్యవేక్షణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్, 42 మందితో కమిటీ ఏర్పాటు

కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : పాస్టర్ రన్నర్ :

రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థుల భారీ మెజారిటీయే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై కూటమి ముఖ్యనేతలు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.క్రమశిక్షణతో కూటమి విజయం సాధించాలి ఎన్నికల ప్రక్రియ పూర్తి ప్రశాంత వాతావరణంలో జరగాలని, ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పార్టీ శ్రేణులు చొరవ చూపాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు అత్యంత క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. బలహీన వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే స్థానిక ఎన్నికల్లో వారికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సీట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించి పల్లెల్లో మౌలిక వసతులు, తాగునీటి సరఫరా వంటి పనులను ముమ్మరంగా చేపడుతున్నామని గుర్తుచేశారు.అరాచకాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోం గతంలో కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ జనసేన ప్రజల పక్షాన నిలబడి జిల్లాలో 50 నుంచి 60 పదవులను కైవసం చేసుకుందని నానాజీ గుర్తుచేశారు. "జైలు–బెయిలు చుట్టూ తిరిగే నేతలు ఎన్నికల్లో గందరగోళం సృష్టించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి అసాంఘిక శక్తులను రప్పించే కుట్రలు చేస్తున్నారు. అలాంటి అరాచకాలను కూటమి శ్రేణులు ఎంతమాత్రం సహించవు. మా బాధ్యతలకు ఎవరు ఆటంకం కలిగించినా ఉపేక్షించేది లేదు" అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. అభ్యర్థులకు న్యాయపరంగా పూర్తి మద్దతు ఇవ్వడానికి యనమల కృష్ణుడు, బార్ల క్రాంతి, కృష్ణవేణి, దివ్యరాజ్ తదితరులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.42 మందితో ఎన్నికల సమన్వయ కమిటీ - యనమల కృష్ణుడు అధిష్టానం ఆదేశాల మేరకు 42 మంది సభ్యులతో ప్రత్యేక ఎన్నికల సమన్వయ కమిటీని ఏర్పాటు చేసినట్లు సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే పంతం నానాజీ మార్గదర్శకత్వంలో లీగల్ సెల్ ద్వారా అభ్యర్థులకు తక్షణ సహాయ సహకారాలు అందిస్తూ, పార్టీకి విజయబావుటా ఎగురవేస్తామని స్పష్టం చేశారు.100 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తాం - బార్ల క్రాంతి కూటమి అభ్యర్థుల గెలుపే ఏకైక ధ్యేయంగా పనిచేస్తున్నామని ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్ల క్రాంతి పేర్కొన్నారు. ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సమన్వయం చేస్తామని, స్థానిక ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి క్లీన్‌స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.


షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ