Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : జనతా వారధి బృందం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పణ


కాకినాడ జిల్లా : కాకినాడ : ఫాస్ట్ రన్నర్ :

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, విద్యార్థుల సమగ్ర వికాసం కోసం "ఆడుదాం ఆంధ్ర" ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని, కేంద్ర క్రీడా నిధులను సమర్థవంతంగా వినియోగించాలని కోరుతూ సోమవారం జనతా వారధి బృందం కాకినాడ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది.

​జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరావు ఆదేశాలు, రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ సూచనల మేరకు ప్రతినిధి బృందం కలెక్టర్‌ను కలసి పలు కీలక అంశాలను వినతిపత్రంలో పేర్కొంది.

​ప్రధాన డిమాండ్లు :

​క్రీడా మౌలిక వసతులు: ప్రతి పాఠశాలలో క్రీడా మైదానాలు, ఆధునిక మల్టీ-స్పోర్ట్స్ మౌలిక వసతులు కల్పించాలి. ప్రైవేట్ పాఠశాలల్లోనూ క్రీడలకు తగిన ప్రాధాన్యత నివ్వాలి.

​క్రీడా విధానం అమలు: 'AP Sports Policy 2024-29'ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలి.

​కేంద్ర నిధుల వినియోగం: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న క్రీడా నిధులను ఏపీలో సక్రమంగా, పారదర్శకంగా వినియోగించాలి.

​అక్రమాలపై విచారణ: గతంలో నిర్వహించిన “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమంలో వచ్చిన అవినీతి, నిర్వహణా లోపాల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలి.

​క్రీడల వల్ల విద్యార్థుల్లో శారీరక, మానసిక వికాసంతో పాటు మానసిక పరిపక్వత పెరుగుతుందని, పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని నాయకులు ఈ సందర్భంగా కలెక్టర్‌ను కోరారు.

​పాల్గొన్న నాయకులు :

కార్యక్రమంలో జనతా వారధి కన్వీనర్ & ప్రధాన కార్యదర్శి దాట్ల కృష్ణ వర్మ, రాష్ట్ర అధికార ప్రతినిధి యార్లగడ్డ రామ్ కుమార్, SC మోర్చా జిల్లా అధ్యక్షులు & జనతా వారధి కో-కన్వీనర్ మారే బుజ్జి, OBC మోర్చా జిల్లా అధ్యక్షులు ఘంటసాల గోవిందరాజులు, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ