Jaggampeta : పేదల కన్నీళ్లు తుడిచిన మహానేత వైఎస్సార్ : ఒమ్మి రఘురామ్
కాకినాడ జిల్లా : జగ్గంపేట : ఫాస్ట్ రన్నర్ :
వైఎస్సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి జీవితంలో కనిపిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు, కాకినాడ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు ఒమ్మి రఘురామ్ అన్నారు.
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా జగ్గంపేటలో జడ్పీటీసీ ఒమ్మి బిందుమాధవి ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో రఘురామ్ ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు. తొలుత తన స్వగృహంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సంస్మరణ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ..
రైతు కష్టం తెలిసిన నాయకుడిగా, పేదవాడి బాధను అర్థం చేసుకున్న నాయకుడిగా వైఎస్సార్ నిలిచారని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా పేదలు, రైతులు, విద్యార్థులకు అండగా నిలిచారని పేర్కొన్నారు.
వైఎస్సార్ రాజకీయాలను కేవలం అధికార సాధనంగా కాకుండా ప్రజా సేవకు సాధనంగా భావించారని రఘురామ్ అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి పరిష్కారాలు చూపించారని తెలిపారు. అందుకే ఆయన పాలన ప్రజల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.
అనంతరం జగ్గంపేట ప్రధాన కూడలిలోని వైఎస్సార్ విగ్రహంతో పాటు గోకవరం రోడ్డులోని వైఎస్సార్ విగ్రహానికి రఘురామ్, జడ్పీటీసీ ఒమ్మి బిందుమాధవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని రఘురామ్ అన్నారు. పేదలు, రైతులు, బలహీన వర్గాల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కర్రి నారాయణమూర్తి, కొట్టు శివరామకృష్ణ, రెడ్డి భానుప్రతాప్, చెరుకూరి మృత్యుంజయరాజు, నీలపల్లి అప్పారావు, కొల్లు ఏసు, పత్తిగుళ్ల దుర్గాప్రసాద్, మోర్త తాతారావు, ఒమ్మి ప్రసాద్, మల్లువలస శ్రీహరి, దండ్రు కుమారస్వామి, సాకా రాజ్‌కుమార్, బత్తిన శ్రీను, పైడి నికంఠ, మట్టాడ రవి, సిమ్మ శ్రీను, కూసి వసంత్, సానబోయిన సత్తిబాబు, గొల్తి నాగబాబు, గుణ్ణంరెడ్డి ప్రేమ్‌కుమార్, కడితి సురేష్, నక్కా వీరబ్రహ్మం, కొప్పుల సుబ్బారావు, ములపాక గిరి, లండా సునీల్, పాక వెంకట్, కట్టు రాజు, కమ్మరి సూరిబాబు, పైలా చైతన్య, చింతల నారాయణమూర్తి, చింతపల్లి రాజేష్, జుట్టుక లోవరాజు, పూడి మధుకిరణ్, బి.వి. సత్యనారాయణ, ఎస్. కోటేశ్వరరావు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
