Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kaikaluru : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్


ఏలూరు జిల్లా : కైకలూరు : ఫాస్ట్ రన్నర్ :

స్థానిక శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానం మండపంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ కామినేని మాట్లాడుతూ...

ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ద్వాపర యుగంలో అధర్మం పెరిగిపోయినప్పుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా భూమిపై అవతరించారని తెలిపారు.

శ్రీకృష్ణుడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదని, గొప్ప మార్గదర్శి అని అన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుందని పేర్కొన్నారు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి అందించిన భగవద్గీత సందేశం ప్రపంచానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. ఫలితాన్ని ఆశించకుండా తమ కర్తవ్యాన్ని నిర్వహించాలనే శ్రీకృష్ణుడి బోధను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని సూచించారు.

కుచేలుడితో శ్రీకృష్ణుడు చూపిన స్నేహం పేద–ధనిక అనే భేదాలు లేని నిజమైన మైత్రికి నిదర్శనమని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలనే గొప్ప సందేశాన్ని శ్రీకృష్ణుడి జీవితం అందిస్తుందని డాక్టర్ కామినేని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ