Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : జిమ్‌ ట్రైనర్‌ హత్య కేసులో నలుగురి అరెస్టు మార్ఫింగ్‌ ఫొటోలే హత్యకు కారణం: అదనపు ఎస్పీ కిషోర్‌కుమార్‌

 

కాకినాడ భానుగుడి సెంటర్‌లో జిమ్‌ ట్రైనర్‌ కొడమాటి సతీష్‌రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ, ఇన్‌చార్జి ఎస్‌డీపీవో డాక్టర్‌ మహంతి కిషోర్‌కుమార్‌ తెలిపారు.
ఆగస్టు 26న తెల్లవారుజామున భానుగుడి సెంటర్‌లోని చార్మినార్‌ టీ సెంటర్‌ వద్ద సతీష్‌రెడ్డిపై నిందితులు దాడి చేసినట్లు దర్యాప్తులో తేలింది. కాళ్లతో తన్నడంతో పాటు చెక్కబద్దతో తల, ముఖం, శరీరంపై దాడి చేశారు. చెక్కబద్ద విరిగిన అనంతరం పదునైన ముక్కతో సాయికిరణ్‌ గొంతులో పలుమార్లు పొడిచినట్లు పోలీసులు వెల్లడించారు.

మార్ఫింగ్‌ ఫొటోలతో వివాదం :

ప్రధాన నిందితుడు బొందల సాయికిరణ్‌కు ప్రేమ వ్యవహారంలో సతీష్‌రెడ్డితో విభేదాలు ఏర్పడ్డాయని పోలీసులు తెలిపారు. సాయికిరణ్‌ మరో యువతితో ఉన్నట్లుగా సతీష్‌రెడ్డి మార్ఫింగ్‌ చేసిన ఫొటోలను అతని ప్రియురాలికి పంపడంతో వివాదం తలెత్తినట్లు చెప్పారు. సతీష్‌రెడ్డి తనను చంపుతానని బెదిరించడంతో, అతడి వల్ల తనకు ప్రాణహాని ఉందనే ఉద్దేశంతో హత్యకు పాల్పడినట్లు సాయికిరణ్‌ విచారణలో వెల్లడించినట్లు అదనపు ఎస్పీ తెలిపారు.

రైల్వే స్టేషన్‌ వద్ద అరెస్టు :

మృతుడి అన్న యర్రయ్యరెడ్డి ఫిర్యాదుతో కాకినాడ టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో క్రైం నంబర్‌ 135/2026 కింద బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 103(1) రెడ్‌విత్‌ 3(5) ప్రకారం కేసు నమోదు చేశారు. నేరం అనంతరం నిందితులు పరారయ్యారు. దుర్గాప్రసాద్‌ తన బుల్లెట్‌ మోటార్‌సైకిల్‌ను కాకినాడ టౌన్‌ రైల్వే స్టేషన్‌ పార్కింగ్‌లో ఉంచి వెళ్లిపోయాడు.
విశ్వసనీయ సమాచారంతో రైల్వే స్టేషన్‌ పార్కింగ్‌ వద్ద పోలీసులు మాటువేసి ఉండగా, బుధవారం సాయంత్రం బుల్లెట్‌ను తీసుకునేందుకు వచ్చిన నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో బొందల సాయికిరణ్‌ (30), ఇంటి సత్యనారాయణ (30), ప్రయాగ దుర్గాప్రసాద్‌ (28), ఇంటి ఆదికృష్ణ (30) ఉన్నారు.
వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, బుల్లెట్‌ మోటార్‌సైకిల్‌, ఘటన సమయంలో ధరించిన దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించనున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు. కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ అభినందించారు.
షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ