Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : బ్యాంక్, ఏటీఎం చోరీ కేసు చేదించిన పోలీసులు..


 కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :

నిందితుడి అరెస్ట్.. రూ.2.96 లక్షల నగదు స్వాధీనం..

గొల్లపాలెం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, ఏటీఎంలో రూ.4 లక్షల 35 వేల నగదు చోరీ కేసును కాకినాడ జిల్లా పోలీసులు ఛేదించారు. రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక, ఇతర దర్యాప్తు పద్ధతుల ద్వారా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి. చైతన్య కృష్ణ తెలిపారు.

కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. ఈ నెల 5వ తేదీ శనివారం రాత్రి గొల్లపాలెం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్, ఏటీఎంలో చోరీ జరిగిందని తెలిపారు. సోమవారం ఉదయం బ్యాంక్ సిబ్బంది చోరీని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు.

డీఎస్పీ మహంతి కిషోర్ కుమార్ పర్యవేక్షణలో సీఐ చైతన్య కృష్ణ, క్రైమ్ సీఐ వెంకట్ త్రినాథ్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాంకేతిక ఆధారాలతో పాటు ఇతర దర్యాప్తు పద్ధతుల ద్వారా కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

నిందితుడిని కాజులూరు మండలం అండ్రంగి గ్రామానికి చెందిన సమావాసి గొల్లయ్యగా గుర్తించినట్లు సీఐ తెలిపారు. అతనిపై గతంలో 13 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.2 లక్షల 96 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చైతన్య కృష్ణ వెల్లడించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ