Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : లైట్ హౌస్ డంపింగ్ యార్డును పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ రక్షణ గోడ నిర్మాణం, కాలుష్య నివారణకు చర్యలు


కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :

 సూర్యరావుపేట లైట్ హౌస్ వద్ద ఉన్న డంపింగ్ యార్డును కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అధికారులతో కలిసి పరిశీలించారు. డంపింగ్ యార్డు కారణంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు, చెత్త నిర్వహణ తీరును పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్షించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ.. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వైర్లు, స్క్రాప్ కోసం డంపింగ్ యార్డులోని వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారని, దీంతో తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడి స్థానిక ప్రజలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.


కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు డంపింగ్ యార్డులోకి అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించేందుకు యార్డు చుట్టూ పటిష్టమైన నూతన కాంపౌండ్ వాల్ నిర్మించనున్నట్లు చెప్పారు. నిరంతర పర్యవేక్షణ కోసం వాచ్‌మెన్‌ను కూడా నియమించనున్నట్లు వెల్లడించారు.


స్థానిక అవసరాలు, అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణంలోకి కొన్ని కంపెనీలు, గుర్తుతెలియని వ్యక్తులు అనుమతి లేకుండా వ్యర్థాలను డంప్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికే అటువంటి వారిపై కఠిన చర్యలు చేపట్టడంతో పాటు నోటీసులు కూడా జారీ చేసినట్లు స్పష్టం చేశారు.


ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. కాకినాడ–రాజమహేంద్రవరం మార్గంలో ఏర్పాటు చేయనున్న నూతన డంపింగ్ యార్డులోకి ప్రస్తుత లైట్ హౌస్ డంపింగ్ యార్డును 2027 జూన్ నాటికి శాశ్వతంగా తరలిస్తామని ఎమ్మెల్యే పంతం నానాజీ స్పష్టం చేశారు. అప్పటివరకు స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు.


ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సోదే ముసలయ్య, మల్లె భాస్కర్, పాలిక ఈశ్వర్, గేదెల చిన్నారావు, గంటా ప్రసాద్, సూరాడ శ్రీనివాస్, కుమారి, దూడ సింహాద్రి, కొనాడ శోభన్ బాబు, చింతకాయల వీరబాబు, కొయ్య స్వామి, కొయ్య సతీష్, వంక దావీదు, మంజు, స్వామి, చాపల ఏబేలు, టెక్కడ శ్రీను, ఉమ్మడి మోసే, చోడిపల్లి నూకరాజు, గరికిన నల్లబాబు, అర్జిలీ శివాజీ తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ