Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రామకృష్ణ ఏకగ్రీవ ఎన్నిక..


 కాకినాడ జిల్లా : కాకినాడ : ఫాస్ట్ రన్నర్ :

కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆదివారం కాకినాడలోని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సుమారు 123 మంది సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

అధ్యక్షుడిగా రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ఉపాధ్యక్షులుగా పేకేటి నాగేశ్వరరావు, కొయ్య శ్రీనుబాబు, సంయుక్త కార్యదర్శిగా కొత్త బైరవకృష్ణ, కోశాధికారిగా పెద్దిరెడ్డి రామాంజనేయ (బాబి) ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థకు పంపిణీ చేసే బియ్యం కోసం కాకినాడ జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. కాకినాడ పోర్టులో ఎలాంటి అక్రమాలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

ఒకరిద్దరు చేసే తప్పుల కారణంగా మొత్తం రైస్ మిల్లర్లపై తప్పుడు సంకేతాలు వెళ్లే పరిస్థితి ఏర్పడుతోందని ఆయన అన్నారు. పోర్టు ద్వారా బొండం బియ్యం, పచ్చి నూకలు మాత్రమే ఎగుమతి జరుగుతున్నాయని స్పష్టం చేశారు. రైస్ మిల్లర్ల సంక్షేమం కోసం తన వంతుగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రామకృష్ణ తెలిపారు.

నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామకృష్ణను పలువురు రైస్ మిల్లర్లు అభినందించి శాలువాలతో ఘనంగా సత్కరించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ