Kakinada : జలహారతి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు: కన్నబాబు
కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :
పోలవరం ప్రాజెక్టుపై వచ్చిన నిపుణుల కమిటీ నివేదికను పక్కన పెట్టి, పాయకరావుపేటలో ‘జలహారతి’ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రభుత్వం ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు.
కాకినాడ రూరల్ వైద్యనగర్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నాసిరకంగా ఉందని కేంద్రం నుంచి వచ్చిన కమిటీ నివేదిక ఇచ్చినా దానిని పక్కన పెట్టి, అనకాపల్లికి నీళ్లు అందిస్తున్నామంటూ జలహారతి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎలినో ప్రభావంతో సుమారు 1.10 లక్షల ఎకరాల్లో రైతులు నాట్లు వేయలేకపోయారని కన్నబాబు తెలిపారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి నది గలగల పారుతోందంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు.
రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం క్రెడిట్, ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించిన కన్నబాబు.. ఇప్పటికైనా ప్రచారాలను పక్కనపెట్టి ప్రజలు, రైతుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు.
