Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : సూర్యారావుపేట తీరంలో ముగిసిన నిమజ్జనోత్సవాలు...


 *యుద్ధప్రాతిపదికన పారిశుధ్య పనులు పూర్తి..

కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :

కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట తీరంలో ఐదు రోజులుగా వైభవంగా సాగిన వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ఉత్సవాల అనంతరం అధికారులు యుద్ధప్రాతిపదికన చేపట్టిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంతో తీరం తిరిగి పరిశుభ్రంగా మారింది.

ఐదు రోజుల పాటు వేలాది విగ్రహాల నిమజ్జనం జరగడంతో పూజా సామగ్రి, పూలు, ప్లాస్టిక్ కవర్లు, కొబ్బరి చిప్పలు, చెక్క పలకలు తదితర వ్యర్థాలు పెద్దఎత్తున పేరుకుపోయాయి. దీంతో అధికారులు ప్రత్యేక పారిశుధ్య బృందాలను రంగంలోకి దించారు. ఉదయం నుంచే సిబ్బంది వ్యర్థాలను వేరు చేసి సేకరించారు.

సేకరించిన వ్యర్థాలు, విగ్రహాల శిథిలాలను జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో తీరం నుంచి డంపింగ్ యార్డులకు తరలించారు. సందర్శకుల భద్రత దృష్ట్యా ఇసుకలో చిక్కుకున్న చెక్కలు, ఇనుప తీగలను కూడా పూర్తిగా తొలగించారు.

మండల పరిషత్ అధికారి పసుపులేటి సతీష్ ఆదేశాలతో, డిప్యూటీ ఎండిఓ రామాంజనేయులు పర్యవేక్షణలో  సూర్యారావుపేట ఇన్‌చార్జి సెక్రటరీ టి.వి.వి. సత్యనారాయణ నేతృత్వంలో వివిధ గ్రామాల కార్యదర్శుల సమన్వయంతో ఈ పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, సందర్శకుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అధికారులు వేగంగా స్పందించడంపై స్థానికులు, పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ