Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : చీకటి పడకముందే గణేశ్‌ నిమజ్జనాలు పూర్తి చేయాలి..


 * 23, 24 తేదీల్లో ముందుగానే పూర్తి చేయాలి..

* ఎస్పీ బిందు మాధవ్‌

* తుఫాను ప్రభావంతో ముందస్తు భద్రతా చర్యలు

*ఘాట్ల వద్ద బందోబస్తు, బారికేడింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ

కాకినాడ జిల్లా : కాకినాడ : ఫాస్ట్ రన్నర్ :

తుఫాను ప్రభావం నేపథ్యంలో గణేశ్‌ నిమజ్జనాల సందర్భంగా కాకినాడ జిల్లా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. సెప్టెంబర్‌ 23, 24 తేదీల్లో జిల్లాలో నిర్వహించే గణేశ్‌ నిమజ్జన కార్యక్రమాలను సాయంత్రం చీకటి పడేలోపే పూర్తి చేసుకోవాలని జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్‌ ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులకు సూచించారు.

వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిమజ్జన కార్యక్రమాలను ముందుగానే ప్రారంభించి, త్వరగా పూర్తి చేసుకోవాలని ఎస్పీ కోరారు. ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులు పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ, పోలీసులు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

* ఘాట్ల వద్ద పటిష్ట బందోబస్తు

గణేశ్‌ నిమజ్జన ఘాట్ల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు బారికేడింగ్‌, ట్రాఫిక్‌ నియంత్రణ, అత్యవసర భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ బిందు మాధవ్‌ విజ్ఞప్తి చేశారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ