Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : పోలీసుల ఖాకీ దర్పం ఎందుకో? ఉద్యోగాలు అడిగితే ఉపాధ్యాయులపై అక్రమ కేసులా? విద్యావేత్త శ్యామ్ ఆవేదన.. పోలీసుల తీరుపై నిరుద్యోగుల మండిపాటు


 కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :

శాంతియుతంగా తమ హక్కులు, ఉద్యోగ అవకాశాల కోసం నిరసన తెలిపిన నిరుద్యోగులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, ఆందోళనతో ప్రత్యక్ష సంబంధం లేని విద్యావేత్తలపైనా కేసులు నమోదు చేయడం సరికాదని ప్రజా సంఘాలు, నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


గత 26 ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులకు శిక్షణ అందిస్తూ, వారిని వివిధ ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడేలా తీర్చిదిద్దిన శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ శ్యామ్ మాస్టర్‌పై పోలీసులు కేసులు నమోదు చేయడం వివాదాస్పదంగా మారింది. కలెక్టరేట్ వద్ద జరిగిన నిరుద్యోగుల ధర్నా నేపథ్యంలో తనపై కేసులు నమోదు చేశారని శ్యామ్ ఆరోపించారు.

రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల సంఖ్యను పరిమితంగా ప్రకటించడంపై నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అయితే ఈ ఆందోళనతో తనకు సంబంధం లేకపోయినా తనపై కేసులు పెట్టారని శ్యామ్ మాస్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.

గంటల తరబడి స్టేషన్‌లోనే..

తనను మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టారని, అనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని శ్యామ్ తెలిపారు. ఈ పరిణామంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

హాస్టళ్లలో పోలీసుల తనిఖీలపై అభ్యంతరం

శ్యామ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన హాస్టళ్లలోకి రాత్రివేళ పోలీసులు వచ్చి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశారని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. వార్డెన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సీఐ ఆధ్వర్యంలో సుమారు పది మంది పోలీసులు హాస్టల్‌లోకి ప్రవేశించి నిద్రిస్తున్న విద్యార్థులను విచారించడం ఆందోళనకు కారణమైందని పేర్కొన్నారు.

కన్నీటిపర్యంతమైన విద్యావేత్త

ఈ పరిణామాలపై నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో శ్యామ్ మాస్టర్ కన్నీటిపర్యంతమయ్యారు. “విద్యార్థుల భవిష్యత్తు కోసమే నా జీవితం. వివాదాలు, రాజకీయ వైరాలు నాకు తెలియదు” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు శిక్షణ అందించడం తప్ప తనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు.

విద్యార్థులు, నిరుద్యోగులు తమ ఉద్యోగ హక్కుల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై సమగ్ర విచారణ జరపాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే కేసుల నమోదుకు సంబంధించిన వాస్తవాలను ప్రభుత్వం, పోలీసు శాఖ స్పష్టం చేయాలని కోరుతున్నాయి.



షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ