Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : కార్యకర్తలే టీడీపీకి వెన్నెముక...


 *పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి...

*ఎమ్మెల్సీ పేరాబత్తుల, జ్యోతుల నవీన్, అబ్జర్వర్ గన్ని...

కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ రూరల్ నియోజకవర్గ అబ్జర్వర్ గన్ని కృష్ణ, నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు. సోమవారం వాకలపూడి మహాలక్ష్మి నగర్‌లోని పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి నివాసం వద్ద నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ఆత్మీయ అభినందన సభ అట్టహాసంగా నిర్వహించారు


ఈ సందర్భంగా కాకినాడ రూరల్, కరప మండలాలకు చెందిన పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు సూచించారు.

‘మై టీడీపీ’ యాప్‌ను ప్రతి కార్యకర్త వినియోగించాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలు, ఇంటింటి ప్రచారం, ప్రజలతో నిర్వహించే కార్యక్రమాలు తదితర వివరాలను యాప్‌లో నమోదు చేయడం ద్వారా పార్టీ కార్యకలాపాలను మరింత సమన్వయంతో నిర్వహించవచ్చని తెలిపారు


పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని, కార్యకర్తలు కష్టించి పనిచేస్తేనే పార్టీ కార్యక్రమాలు విజయవంతమవుతాయని నాయకులు పేర్కొన్నారు. గ్రామ, మండల స్థాయిలో ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుని, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.

బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించాలని, అనుబంధ విభాగాలు చురుగ్గా పనిచేస్తూ యువత, మహిళలు, బీసీలు, వివిధ వర్గాలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధిష్ఠానం ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ టీడీపీ అధ్యక్షుడు కాళ్ల శ్రీనివాస్, కరప మండల అధ్యక్షుడు మద్దూరి వీవీఎస్ స్వామి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు పిల్లి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎలాగ లోవరాజు, బీసీ సెల్ అధ్యక్షుడు కొమిరిశెట్టి నరసింగరావు, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు సుధీర్‌తో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, వివిధ స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు, క్లస్టర్, యూనిట్, బూత్ పార్టీ నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ