Kakinada : ఉపాధ్యాయులపై భౌతిక దాడులు దురదృష్టకరం..
* టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని తిరుమల కుమార్
కాకినాడ జిల్లా: కాకినాడ : ఫాస్ట్ రన్నర్ :
ఉపాధ్యాయులపై వైసీపీ శ్రేణులు భౌతిక దాడులకు పాల్పడటం దురదృష్టకరమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మేయర్ సుంకర పావని తిరుమల కుమార్ అన్నారు. ఉపాధ్యాయుల పట్ల అమానుషంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు, జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం, ఏడాది కాలంగా వారిని మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, టెట్ స్కోర్లతో తమ అర్హతలను నిరూపించుకునేందుకు శాంతియుతంగా ప్రయత్నిస్తుండగా వారిపై దాడులకు పాల్పడటం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులను అసభ్య పదజాలంతో దూషించడం, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని పావని అన్నారు. ఇలాంటి ఘటనలు ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన కలిగిస్తాయని తెలిపారు.
ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడిన వారిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతియుత మార్గాల్లో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని పావని సూచించారు
