Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : రైతులను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం...


కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :

రైతులకు రుణాల రీషెడ్యూల్ చేయాలి.. మైనింగ్, సహకార బ్యాంకు అవినీతిపై విచారణ జరపాలి..

వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ ఎమ్మెల్యే దొరబాబు డిమాండ్..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని వైఎస్సార్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావం పేరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పశువులకు గడ్డి కూడా లభించని పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. రైతుల రుణాలను వెంటనే రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో 93 శాతం సాగు జరుగుతోందని వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రమైన తెలంగాణలో 93 శాతం సాగు జరుగుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. ఎల్‌నినో పేరుతో రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పశువులకు గడ్డి లేని పరిస్థితి ఏర్పడిందంటే అందుకు కూటమి ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శించారు.

కొడవలిలో భారీ మైనింగ్‌పై ఆరోపణలు..

పిఠాపురం నియోజకవర్గంలోని కొడవలి ప్రాంతంలో కేజీఎఫ్‌ను మించి భారీగా మైనింగ్ జరుగుతోందని దాడిశెట్టి రాజా ఆరోపించారు. కౌడాలో కనిపించని భారీ అవినీతి జరుగుతోందని, దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

నేపాల్, శ్రీలంక వంటి దేశాల నుంచి పిఠాపురానికి వచ్చి బౌద్ధులు నిరసన తెలియజేసే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటిపై కాకినాడ జిల్లా మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు.

ఒకప్పుడు శ్రీలంకను పోల్చిన పాలకులు, ప్రస్తుతం ఆ దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న పరిస్థితిని గమనించాలని వ్యాఖ్యానించారు.

సహకార బ్యాంకు ఉద్యోగులకు న్యాయం చేయాలి..

సహకార బ్యాంకు ఉద్యోగులను మోసం చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తుమ్మల రామస్వామి బాబుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్యలు ఎప్పుడు తీసుకుంటారని మాజీ ఎమ్మెల్యే దొరబాబు ప్రశ్నించారు.

ఉద్యోగుల వద్ద డబ్బులు తీసుకుని సెల్ఫ్ డిక్లరేషన్‌లు తీసుకొని వారిని భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. 52 బ్రాంచ్‌లలో పనిచేస్తున్న 320 మంది ఉద్యోగులను మోసం చేశారని పేర్కొన్నారు.

సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే అసలు బండారం బయటపడుతుందని దొరబాబు అన్నారు. సర్వీస్ లేని వారికి పదవులు ఎలా కట్టబెట్టారో తేల్చేందుకు సర్వీస్ రిజిస్టర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగులకు న్యాయం చేయడంతో పాటు అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడక నాగమణి  వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు


షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ