Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada :వర్షంలోనూ బందోబస్తు విధుల్లో పోలీసు సిబ్బంది...


 *చీకటి పడేలోపే నిమజ్జనాలు పూర్తి చేయాలి..

*ఎస్పీ బిందు మాధవ్‌

కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :

కాకినాడ జిల్లాలో తుఫాను ప్రభావం దృష్ట్యా గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు సురక్షితంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఆదేశాల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పోలీసు అధికారులు, సిబ్బంది నిమజ్జన ఘాట్లు, ప్రధాన కూడళ్లు, ఊరేగింపు మార్గాల్లో విధులు నిర్వహిస్తూ ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బుధవారం కాకినాడలోని జగన్నాధపురం బ్రిడ్జి, బ్రహ్మంగారి మఠం, బలరాం సెంటర్, డ్రై ఫిష్ మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ఘాట్లను ఎస్పీ జి. బిందు మాధవ్ స్వయంగా పరిశీలించారు. తుఫాను ప్రభావం నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిమజ్జనాలను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా పోలీసు అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,150 గణేష్ విగ్రహాల నిమజ్జనాలకు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఇద్దరు అదనపు ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 34 మంది ఎస్‌ఐలు, 74 మంది ఏఎస్ఐలు/హెడ్ కానిస్టేబుళ్లు, 171 మంది కానిస్టేబుళ్లు/మహిళా పోలీసు సిబ్బంది, 121 మంది హోంగార్డులు, 68 మంది క్యూఆర్టీ సిబ్బందిని కేటాయించారు.

పోలీసు శాఖ ముందస్తు ప్రణాళిక, సమన్వయంతో చేపట్టిన చర్యల ఫలితంగా బుధవారం చీకటి పడేలోపే జిల్లాలో సుమారు 60 శాతం గణేష్ విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. గత ఏడాది ఇదే సమయానికి సుమారు 40 శాతం విగ్రహాల నిమజ్జనం మాత్రమే పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

తుఫాను ప్రభావం నేపథ్యంలో గురువారం (24.09.2026) కూడా వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నందున గణేష్ ఉత్సవ మండపాల నిర్వాహకులు, కమిటీ సభ్యులు, భక్తులు పోలీసు శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది. నిమజ్జనాలను ముందస్తు ప్రణాళికతో వీలైనంత త్వరగా, చీకటి పడేలోపే పూర్తి చేసేలా సహకరించాలని కోరింది.

ఊరేగింపుల్లో అనవసర జాప్యం చేయకుండా పోలీసుల సూచనలు పాటించాలని, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. అందరి సహకారంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా పూర్తి చేయాలని జిల్లా పోలీసు శాఖ కోరింది.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ