Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : కూటమి అరాచకం.. మీడియాపై ఉక్కుపాదం..


 కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :

రాష్ట్రంలో ప్రభుత్వం కంటే రెడ్‌బుక్ రాజ్యాంగమే నడుస్తోందని, ఇది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పాలనను మించిపోయే పరిస్థితులకు దారితీస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే వారిని పోలీసులతో అరెస్టు చేయడం దారుణమన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానాలు సామాన్య ప్రజల్లో వ్యక్తమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై వార్తలు ప్రసారం చేస్తున్న పలు మీడియా సంస్థల గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చేపడుతున్న ఆందోళనలను కవర్ చేస్తున్న ఛానళ్ల ప్రసారాలను నిలిపివేయడం దుర్మార్గమన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కులను పోరాటాల ద్వారా సాధించుకున్న అనేక సందర్భాలు ఉన్నాయని గుర్తుచేసిన నాగమణి, వారి హక్కులను కాలరాస్తే గతంలో ప్రభుత్వాల గతిని మార్చిన సంఘటనలను కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు.

ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలను ఎత్తిచూపుతున్న మీడియాను అణచివేయడం ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేయవచ్చని భావించడం సరికాదన్నారు. కేబుల్ ఆపరేటర్లను భయభ్రాంతులకు గురిచేసి తమ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సొమ్ములను ఎరగా వేస్తున్నారని, ప్రధాన మీడియా సంస్థలకు మైనింగ్, కాంట్రాక్టులను ఎరగా చూపుతూ తమకు వ్యతిరేకంగా ఉన్న మీడియాపై ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు.

ప్రకృతి విపత్తులు, తుఫాన్లకు సంబంధించిన వార్తల ప్రసారాలపైనా ఆంక్షలు విధించే పరిస్థితి రావడం ఆందోళనకరమన్నారు. చినుకు పడితే భయం, వరద వస్తే భయం, గాలి వీచినా భయపడే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని వ్యాఖ్యానించారు. మీడియా కథనాల ఆధారంగా ప్రజల అవసరాలను గుర్తించి పరిష్కరించే పరిస్థితి నుంచి, తమకు అనుకూలమైన వార్తలను ప్రసారం చేయించుకునే స్థాయికి ప్రభుత్వం దిగజారడం దురదృష్టకరమన్నారు.

అరచేతితో సూర్యుడిని అడ్డుకోలేరన్నది ఎంత నిజమో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చేరకుండా ఆపడం కూడా అంతే అసాధ్యమని నాగమణి అన్నారు. ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో ఏ అంశమైనా క్షణాల్లో ప్రజలకు చేరుతోందని పేర్కొన్నారు. ప్రజల నుంచి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతోందని, రాబోయే రోజుల్లో ప్రజలు తగిన సమాధానం చెబుతారని జమ్మలమడక నాగమణి వ్యాఖ్యానించారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ