Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : పిఠాపురంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ ఏర్పాట్ల పరిశీలన..


 కాకినాడ జిల్లా : పిఠాపురం : ఫాస్ట్ రన్నర్ :

పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  పిఠాపురంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఏర్పాట్లను పరిశీలించారు.

యు.కొత్తపల్లి మండలంలోని నాగులపల్లి రక్షిత తాగునీటి పథకం (CPWS), ‘పీఠికాపుర వనం’ ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. చెత్తతో నిండిన డంపింగ్ యార్డును సుందరీకరించి ఆహ్లాదకరమైన వనంగా తీర్చిదిద్దడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ ఆలోచన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

అనంతరం మంగళవారం పిఠాపురంలో జరగనున్న సభా ప్రాంగణాన్ని కూడా నానాజీ పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలా కృష్ణ, పిఠాపురం ఫైవ్‌మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ