Kakinada : మోదీ జన్మదిన వేడుకలకు జగ్గంపేట సిద్ధం..
కాకినాడ జిల్లా : జగ్గంపేట : ఫాస్ట్ రన్నర్ :
ఇర్రిపాక ఏలేరు తీరాన వెయ్యి దీపాలతో మహా దీపోత్సవం...
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జగ్గంపేట నియోజకవర్గంలో భారీ వేడుకలకు బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో గురువారం పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి దాట్ల కృష్ణ వర్మ (సాహితి వర్మ) తెలిపారు.
జగ్గంపేటలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలోని ఏలేరు నది తీరాన ఉన్న శివాలయం వద్ద గురువారం సాయంత్రం వెయ్యి దీపాలతో మహా దీపోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దీపాలను వెలిగించనున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి తుమ్మలపల్లి రమేష్ హాజరు కానున్నట్లు తెలిపారు.
బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దాట్ల కృష్ణ వర్మ పిలుపునిచ్చారు. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
