Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : రౌడీ షీటర్లకు కాకినాడ జిల్లా పోలీసుల కౌన్సిలింగ్... చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక...


 కాకినాడ జిల్లా : కాకినాడ : ఫాస్ట్ రన్నర్ :

కాకినాడ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు.


ఈ సందర్భంగా రౌడీ షీటర్లకు పోలీసులు పలు సూచనలు చేస్తూ.. సమాజంలో అరాచకాలు సృష్టించడం, ప్రజలను బెదిరించడం, అక్రమ సెటిల్‌మెంట్లకు పాల్పడటం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. తమ ప్రవర్తనను మార్చుకుని బాధ్యతాయుతమైన సాధారణ జీవితం గడపాలని సూచించారు.


ఇకపై చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎలాంటి చర్యలనూ సహించేది లేదని స్పష్టం చేశారు.


ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో కాకినాడ టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ మజ్జి అప్పలనాయుడు, సర్పవరం ఇన్‌స్పెక్టర్ సి.హెచ్. ప్రకాష్, పెదపూడి ఎస్‌ఐ బుజ్జిబాబు, తుని టౌన్ ఎస్‌ఐ విజయ్ తో పాటు వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ