Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : పవర్‌ డిప్లొమా ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం ఏకగ్రీవం...


 కాకినాడ జిల్లా : కాకినాడ : ఫాస్ట్ రన్నర్:

స్థానిక ఎన్‌ఎఫ్‌సీఎల్‌ రోడ్డులోని ఐఎంఏ భవనంలో ఆదివారం కాకినాడ సర్కిల్‌ యూనిట్‌ పవర్‌ డిప్లొమా ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. 2027–2028 రెండేళ్ల కాలానికి సంబంధించి జరిగిన ఎన్నికల్లో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశానికి ఎ. వీరభద్రరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. సన్యాసిరావు, ఈపీడిస్కామ్‌ యూనిట్‌ ప్రధాన కార్యదర్శి జి. జోగినాయుడు, పలువురు డిస్కామ్‌ ప్రతినిధులు హాజరయ్యారు.నూతన కార్యవర్గానికి అధ్యక్షుడుగా ఎ. వీరభద్రరావు,కార్యదర్శిగా గౌతు రాజు,ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు గా ఎం. శ్రీనివాస్‌, మహిళా ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా సిహెచ్‌. వాసవి కోశాధికారిగా వి. సుబ్బారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు స్థానిక ఎమ్మెల్యే, ఈఈ జి.వి.ఎల్.ఎన్. శ్రీనివాస్, సూపరింటెండెంట్‌ ఎన్. ఉదయ్‌ భాస్కర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమం, సంస్థ పురోగతికి కొత్త కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఈఈ జి.వి.ఎల్.ఎన్. శ్రీనివాస్‌ను అసోసియేషన్‌ ప్రతినిధులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిస్కామ్‌ ఇంజనీర్లు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ