Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం...


కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :

 45 రోజుల ‘ఇంటింటికి తెలుగుదేశం’ పూర్తి.. 

-తాగునీరు, పింఛన్లు, ఇళ్ల సమస్యలు ప్రధానంగా ప్రస్తావన: పిల్లి దంపతులు

కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, డివిజన్లలో 45 రోజులపాటు నిర్వహించిన “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు వాకలపూడి మహాలక్ష్మినగర్‌లోని తమ నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 45 రోజులపాటు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, డివిజన్‌లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నామని తెలిపారు. ప్రధానంగా తాగునీరు, పింఛన్లు, హౌసింగ్‌ సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. పరిష్కరించగలిగిన సమస్యలపై కృషి చేశామని, మిగిలిన వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు.

తాగునీటి సమస్యపై పిల్లి దంపతులు తీవ్రంగా స్పందించారు. అధికారుల అలసత్వం కారణంగానే ప్రజలకు సక్రమంగా తాగునీరు అందడం లేదని ఆరోపించారు. సమస్యను స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి తీసుకెళ్లకుండా అధికారులు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. డివిజన్లకు నీరు అందుతున్నప్పుడు కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని గ్రామాలకు తాగునీరు ఎందుకు అందడం లేదో అధికారులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

తాము ఎమ్మెల్యేలుగా పనిచేసిన సమయంలో సూర్యారావుపేట, తూరంగి,వేళంగి, కరప, ఎస్‌.అచ్చుతాపురం ప్రాంతాల్లో ఐదు వాటర్‌ స్కీమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. రూ.100 కోట్లకు పైగా నిధులతో ట్యాంకులు నిర్మించి, ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా గ్రామాలకు తాగునీరు అందించామని గుర్తుచేశారు. ప్రస్తుతం వాటిని సక్రమంగా నిర్వహించకపోవడంతో గోదావరి జలాలు కలిసిపోయి నీరు తాగేందుకు అనువుగా లేకుండా పోతోందని పేర్కొన్నారు.పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చిందని పిల్లి దంపతులు తెలిపారు. వచ్చే నెల 1వ తేదీన నూతన పింఛన్లు విడుదల కానున్నాయని చెప్పారు. అర్హత ఉన్నవారికి పింఛన్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.ఇళ్ల కోసం హౌసింగ్‌ స్కీమ్‌ కల్పించాలని పలువురు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. అర్హులైన కుటుంబాలకు ఇళ్ల మంజూరు విషయంలో వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పిల్లి దంపతులు చెప్పారు.

45 రోజుల కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు, సమస్యలను క్రోడీకరించి అవసరమైన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు సమష్టిగా కృషి చేస్తామని పిల్లి దంపతులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వర రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దొమ్మేటి వెంకట రమణ, ఇట్టా చిన వెంకటేశ్, సీనియర్ నాయకులు కాళ్ళ శ్రీనివాస్,ఏడుకొండలు, పెంకె వీరబాబు, మేడిశెట్టి బుజ్జి, పలివెల గాయత్రి, రామారావు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ