Kakinada :మెడికవర్ హాస్పిటల్స్‌లో నూతన క్యాన్సర్ వింగ్ ప్రారంభం
కాకినాడ జిల్లా : కాకినాడ రూరల్ : ఫాస్ట్ రన్నర్ :
మెడికవర్ హాస్పిటల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ వింగ్‌ను మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీఎస్ఎన్ వర్మ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ ప్రజలకు అత్యాధునిక క్యాన్సర్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.
లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్, జనసేన నాయకులు దుగ్గన బాబ్జీ క్యాన్సర్ వింగ్‌ను సందర్శించి ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.
క్యాన్సర్ నిర్ధారణ నుంచి చికిత్స వరకు మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఆంకాలజీ విభాగాల సమన్వయంతో సమగ్ర వైద్య సేవలు అందిస్తామని సెంటర్ హెడ్ ఎన్. అంజిబాబు తెలిపారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి, వైద్యుల సూచనల మేరకు సరైన చికిత్స తీసుకోవాలని డాక్టర్లు మురళీధర్, పృధ్వీరాజ్, ప్రదీప్ భాస్కర్, సమంత్ కుమార్, శివ భరత్ సూచించారు.
నూతన క్యాన్సర్ వింగ్ అందుబాటులోకి రావడంతో కాకినాడతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన క్యాన్సర్ వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని వారు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
