Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : పెద్దాపురం ఆర్డీవో ఇంట్లో భారీ చోరీ కేసు ఛేదన...


 *దొంగ అరెస్ట్.. రూ.15 లక్షల నగదు, 105.4 గ్రాముల బంగారం స్వాధీనం..

*సాంకేతిక ఆధారాలతో నిందితుడి గుర్తింపు.. దర్యాప్తు బృందానికి ఎస్పీ అభినందనలు...

కాకినాడ జిల్లా : పెద్దాపురం : ఫాస్ట్ రన్నర్ :

పెద్దాపురం పట్టణంలోని ఆర్డీవో నివాసంలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి రూ.15 లక్షల నగదుతో పాటు 105.4 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వెల్లడించారు.

ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. గత జూలై 25వ తేదీ అర్ధరాత్రి పెద్దాపురం రామారావుపేటలోని డీఎల్పీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఆర్డీవో నివాసంలో గుర్తుతెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. ఇంటి వెనుక భాగంలోని మెష్ డోర్‌ను తెరిచి లోపలికి ప్రవేశించిన నిందితుడు రెండో గదిలోని కప్‌బోర్డులో ఉన్న తాళం సాయంతో ఇనుప అల్మారాను తెరిచాడు. అందులో ఉన్న సుమారు రూ.30 లక్షల విలువైన 276 గ్రాముల బంగారం, 48 గ్రాముల వెండి, రూ.75 వేల నగదును అపహరించాడు.

బాధితుడి ఫిర్యాదు మేరకు పెద్దాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యక్ష ఆధారాలు లభించని ఈ క్లిష్టమైన కేసును జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిశిత దర్యాప్తు పద్ధతులతో ఛేదించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మామిడి శివకుమార్ అలియాస్ శివ ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. శనివారం వడ్లమూరు గ్రామ శివారులోని శ్రీ సాయి ఎంటర్‌ప్రైజెస్ హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద నిందితుడు సంచరిస్తుండగా పెద్దాపురం సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం అదుపులోకి తీసుకుంది.

నిందితుడి వద్ద నుంచి రూ.15 లక్షల నగదుతో పాటు 105.4 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

*దర్యాప్తు బృందానికి ఎస్పీ అభినందనలు..

క్లిష్టమైన కేసును సాంకేతిక ఆధారాలతో ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన అదనపు ఎస్పీ డాక్టర్ మొహంతి కిషోర్ కుమార్, పెద్దాపురం ఎస్డీపీవో ఏబీజీ తిలక్, పెద్దాపురం సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, సీసీఎస్ సీఐ అంబటిబాబు, ఐటీ కోర్ సీఐ దుర్గా శేఖర్ రెడ్డి, పెద్దాపురం ఎస్సై యు. పాపారావుతో పాటు పోలీసు సిబ్బంది వి. శేషారావు, బలరామమూర్తి, శ్రీహరి, మూర్తి, నాగరాజు, రమణ, ఎస్. బాలాజీ, ఎ. మురళి తదితరులను ఎస్పీ బిందు మాధవ్ ప్రత్యేకంగా అభినందించారు. దర్యాప్తు బృందానికి రివార్డులు ప్రకటించారు

షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ