Skip to main content
📅 డేట్ లోడింగ్... | ⏰ టైమ్ లోడింగ్...

Kakinada : పేదలకు అండగా కూటమి ప్రభుత్వం...


 *ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో నాయకులు...

కాకినాడ జిల్లా : కాకినాడ : పాస్ట్ రన్నర్ :

ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్‌బాబు అన్నారు. గురువారం కాకినాడ నగరంలోని 38వ వార్డులో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

రాజ్యసభ సభ్యులు సానా సతీష్‌బాబు, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి.వి. సత్యనారాయణ తదితరులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లను అందజేశారు. పింఛన్ అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సానా సతీష్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 61 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందన్నారు. ఇందుకోసం ప్రతి నెలా సుమారు రూ.2,500 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. కాకినాడ నగరంలో 28,544 మంది లబ్ధిదారులకు నెలకు రూ.12.54 కోట్ల మేర పింఛన్ సొమ్ము పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నారని తెలిపారు. లబ్ధిదారులకు పూర్తి పింఛన్ సొమ్ము సకాలంలో అందుతోందా లేదా అన్న విషయాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలోనే కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని సానా సతీష్‌బాబు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, డివిజన్ ఇన్‌చార్జి ఏవీడీ మెంటారావు, టీపీఆర్వో సతీష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ తదితరులు పాల్గొన్నారు.


షేర్ చేయండి: 📱 WhatsApp 📘 Facebook ✖️ X

Popular News From This Site

Kakinada : సరిపడా నిద్ర.. తక్కువ ఆందోళన.. ఆరోగ్యవంతమైన గుండెకు సూత్రాలు ..

Kakinada : సర్పవరంలో వైసీపీకి షాక్‌...

Kakinada : పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల భారీగా సేకరణ...

Kakinada : ఇరిగేషన్‌ కాలువ పూడికలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

Kakinada : ఆరోగ్యానికి పచ్చదనమే రక్ష -ప్రముఖ ఆంకాలజీ సర్జన్ డాక్టర్ ప్రశుబు •

Kakinada : జన్మభూమి పార్కులో వాకర్స్‌కు పెయిన్ అవేర్‌నెస్ కార్యక్రమం...

Kakinada : గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాలి..

Kakinada : కోరమాండల్ సీఎస్ఆర్ కార్యక్రమంలో చిన్నారులకు ఉచిత గుండె వైద్య పరీక్షలు..

Kakinada : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు...

Kakinada :ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ...

🏠
హో మ్ పే జీ